Take a fresh look at your lifestyle.

ప్రధాన రహదారి ప్రక్కన రక్షణ గోడ నిర్మించాలి. -సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి.

ముద్ర,మోత్కూరు:
పాటిమట్ల నుండి ఎక్స్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో సల్లోం బావి వద్ద రోడ్డు ప్రక్కన రక్షణ గోడలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డుకు రక్షణగోడ నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. సమస్యలపై పోరుబాటలో భాగంగా శుక్రవారం పార్టీ నాయకులతో కలసి పాటిమట్ల గ్రామంలో గల సమస్యలను పరిశీలించ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాటిమట్ల నుండి ఎక్స్ రోడ్డుకు వెళ్లే ప్రధాన దారిలో చెరువు పక్కన సల్లోం బావికి ఆనుకోని ప్రధాన రహదారి ఉండటంతో రక్షణ గోడలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో చాల సార్లు వాహనదారులు ప్రమాధాలకు గురైయారని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటికి ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని అన్నారు. వెంటనే ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి ప్రమాధాకరంగా ఉన్న సల్లోం బావి వద్ద, కుమ్మరి బావి వద్ద ప్రధాన రహదారిలో ప్రమాధాల నివారణకు రక్షణ గోడ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య, కురిమేటి సోమయ్య, బండి రవి, కురిమేటి సాంబయ్య, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.