Take a fresh look at your lifestyle.

ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన శివాజీ – ఎంపీ ఈటల రాజేందర్

 

ముద్ర మల్కాజిగిరి

భారత దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడేందుకు చత్రపతి శివాజీ చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గ జయంతి వేడుకలలో భాగంగా.. మునీరాబాద్ లోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ
మొగలాయి చక్రవర్తుల దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎదిరించిన ధీరుడు. పరాయి పాలకులు భారత ప్రజల ప్రాణమానాలను హరిస్తున్న సమయంలో భారత జాతిని కాపాడటంలో ఆయన చేసిన త్యాగం యుద్ధం వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయని అన్నారు.
శివాజీ మహారాజ్ చరిత్ర శాశ్వతంగా ఉండాలని, వచ్చే తరాలు ఆ చరిత్రను మననం చేసుకోవాలని శ్రీశైలంలో ఆయన స్ఫూర్తి కేంద్రం గొప్పగా ఏర్పాటు చేసుకున్నాము. అది మన తెలుగు రాష్ట్రాలలో ఉండడం మనకు గర్వకారణం,దేశభక్తిని పెంపొందించి దేశాన్ని సుభిక్షంగా సురక్షితంగా ఉంచుకోవడం ఈ స్ఫూర్తి కీలక పాత్ర పోషిస్తుంది అని ఈటల రాజేందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి మల్లికాఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మల్కాజిగిరిలో

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా మారుతీ నగర్ శివాజీ పార్క్ వద్ద శివాజీ విగ్రహానికి మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ పోరాటపటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తో పాటు పలువురు యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.