Take a fresh look at your lifestyle.

కళాశాల భవనం పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

 

ముద్ర, బండ్లగూడ: కళాశాల భవనం పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శివరాంపల్లి లో నివాసముండే రితిక విద్యార్థిని భవాని కాలనీలో శ్రీ వైష్ణవి బాలికల కళాశాలలో బైపిసి రెండవ సంవత్సరం చదువుతుంది. కళాశాల మూడో అంతస్తు నుండి గురువారం సాయంత్రం దూకి ఆత్మహత్య యత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు, కళాశాల నిర్వాహకులు తీవ్ర గాయాలకు గురైన రితికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అదే సమయంలో కళాశాల చుట్టూ కొందరు యువకులు పిడి గుద్దులు గుద్దుకుంటూ హంగామా చేశారు. ఈ గ్యాంగ్ వార్ కు విద్యార్థిని ఆత్మహత్యకు ఏవైనా సంబంధాలు ఉన్నాయని కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని 48 గంటలు గడిస్తే కానీ ఆమె పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.