Take a fresh look at your lifestyle.

పసుపు రాజధానిగా నిజామాబాద్

  • పసుపు బోర్డుతో ఇందూర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు.
  • ఇక్కడి పసుపునకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం.
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.
  • నక్సలైట్లు లొంగిపోవల్సిందే.
  • నక్స ల్స్ మద్దతుగా మాట్లాడేవారు బాధిత కుటుంబాలను కూడా చూడాలన్నారు.
  • ఇప్పటికే పదివేల మంది మావోయిస్టులు లొంగిపోయారు.
  • 2026 మార్చిలోగా నక్సలిజాన్ని అంతమొందిస్తాం.
  • నిజామాబాద్‌లో కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇకపై పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీగా వెలుగొందుతుందని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఇందూర్ రైతుల పోరాటాన్ని గుర్తించిన ప్రధాని మోడీ సర్కార్ పసుపు బోర్డును ఏర్పాటు చేసిందని చెప్పారు.పసుపు బోర్డు ఏర్పాటుతో ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందన్నారు.ఈ మేరకు ఆదివారం నిజామాబాద్‌లో కేంద్ర పసుపు బోర్డు జాతీయ కార్యాలయంను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజ.య్, ఎంపీలు అర్వింద్‌, డాక్టర్ కె. లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడారు.. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు.ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్ పసుపుబోర్డును సాధించారని అభినందించారు. నిజామాబాద్ రైతులు పుసుపు బోర్డు కోసం 40 ఏళ్ళు పాటు పోరాటం చేశారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్ పోర్టు లిమిటెడ్ కూడా నిజామాబాద్‌లోని ఏర్పాటవుతాన్నారు. అనాదిగా నిజామాబాద్ రైతులు పుసుపు సాగు చేస్తున్నప్పటికీ బయట మార్కెట్‌లో తగిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్నారు. ఇకనుంచి ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎక్స్ పోర్టు పసుపు బోర్డు చేస్తుందన్నారు. నిజామాబాద్ పసుపునకు జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నామని ఆయన చెప్పారు. 2030 లోపు 1 మిలియన్ డాలర్ పసుపు ఎగుమతి ప్రణాళిక చేశామన్నారు. పసుపు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు చేస్తామన్నారు. 2025 లో పసుపుకి రూ.19 వేల ధర వచ్చిందని, రానున్న మూడేళ్ళలో పసుపు ధర రూ.6వేల నుంచి రూ.7వేల అధికం కానుందన్నారు. బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తి కూడా పెరగనుందన్నారు. తెలంగాణను పదేళ్ళ పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని కేంద్రమంత్రి అమిత్ షా విమర్శించారు.ధరణి పార్టల్, కాళేశ్వరం వంటి అనేక అంశాల్లో బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన అంతమైనప్పటికీ అవినీతి మాత్రం పోలేదని ఆయన దుయ్యబట్టారు.ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వానికి ఏటీఎంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.ఉగ్రవాదమే కాదు దేశంలో నక్సలిజం రూపులేకుండా చేయలన్నదే ప్రధాని మోడీ సర్కార్ లక్ష్యమని అన్నారు.ఆయుధాలను పట్టిన వారిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.తక్షణమే హింసాకాండను వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోవాలని మావోయిస్టులకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు.జనజీవన స్రవంతిలోకి రావాలని, ఇప్పటికే పది వేలమంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన చెప్పారు. నక్సలిజాన్ని తుదముట్టించి, 2026 మార్చి 30లో దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్నారు.నక్స్‌ల్స్ మద్దతుగా మాట్లాడేవారు బాధిత కుటుంబాలను కూడా చూడాలన్నారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్తాన్ మన దేశాన్ని భయపెట్టాలని చూసిందని, అయితే మన సైనికుల ఎదురుదాడితో భారత్ శక్తి ఏమిటే పాకిస్తాన్ సహా ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.