ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం తెల్లవారుజామున బాసరకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బాసర ఐఐఐటీ వసతి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు.అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు.