ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నూక పల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి స్మశానవాటిక లేదని, స్థలం కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కాలనివాసులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాల కల్పన విషయాన్ని ముఖ్యమంత్రి,రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, తన వంతుగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని,ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధాత్రిక నరేందర్, రామగిరి రమేష్, బొల్లారం స్వామి, విజయ, ఖలీల్, శ్రీను, పద్మ ,అజార్, రవికుమార్, ఫజల్, శివాజీ, అక్మల్ ,కమలాకర్, కృష్ణ, సత్యం, తదితరులు పాల్గొన్నారు.