Take a fresh look at your lifestyle.

స్నేహితురాలి కి చిన్న నాటి స్నేహితుల చేయూత.

ముద్ర,మోత్కూరు:
మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఎస్ ఎస్ సీ బ్యాచ్ స్నేహితురాలు మహాలక్ష్మీ తల్లిదండ్రులు జినుకల చంద్రయ్య, వీరమల్లమ్మ మృతి చెందగా తోటి స్నేహితులు అండగా నిలిచారు. 2009-10 పదవ తరగతి పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు మంగళవారం మహాలక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.14 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు తొంట నరేష్, ఎర్సనిపల్లి సందీప్, వంగూరి శ్రీకాంత్, బొడ్డు మహేష్, ముకెర్ల లక్ష్మణ్, వంగూరి మల్లేష్, బుశిపాక బుగ్గరాములు, మధన్ జోసెఫ్,
మహ్మద్ గౌస్, ఎలుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.