Take a fresh look at your lifestyle.

భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడి పూజ.

ముద్ర,మోత్కూర్:
మోత్కూర్ మండలంలోని ముషి పట్ల గ్రామంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి గుట్టపైన ఉన్న హరిహర పుత్ర అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం భక్తులు అత్యంత శ్రద్ధలతో పడిపూజ ను నిర్వహించారు. అయ్యస్వామి జన్మ దినోత్సవం ను పురస్కరించుకొని అయ్యప్ప స్వామి పడి పూజను నిర్వహించారు. ముందుగా గణపతి హోమం జరిపి, గణపతి,సుబ్రమణ్య స్వామి,అయ్యప్ప స్వాములకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి కి పంచామృతాల తో పాటు గంధం, విభూతి, పసుపు,కుంకుమ, పూలు,పండ్లతో అభిషేకాలు జరిపి పూలు పండ్లు దీపాలతో అలంకరించిన పడి18 మెట్ల పై కర్పూరం వెలిగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్న ప్రసాదం అందించారు.పూజా కార్యక్రమాలను పురోహితులు మోత్కూర్ ప్రదీప్ శర్మ, మోత్కూర్ సందీప్ శర్మ, హర్షవర్ధన్ శర్మ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫైళ్ల నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ అంజయ్య, బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ మడిగే శేఖర్,అయ్యప్ప స్వామి భక్తులు మజ్జిగ మధుసూదన్ రెడ్డి, బాహుపెళ్లి విజయ్ కుమార్, తండ సత్తయ్య, సుదగాని పాండు,పట్టురి శివ,బీసు రాంబాబు, బండారు రాజేంద్ర ప్రసాద్, ఆరాని శేఖర్, బండ నర్సిరెడ్డి, బద్దీశెట్టి సంతోష్, శేఖర్,బాసోజు లక్షణాచారి,చెన్నూరు శ్రీపతి, జిల్లా కంకరత్నం,పొలాసు సాయి కిరణ్,సోమన్న, మజ్జిగ హర్షవర్ధన్ రెడ్డి,బండి నర్సింహ, తాండ్ర నారాయణ స్వామి, కరుణాకర్ ,రాధారపు మల్లేష్,మేరుగు రాజశేఖర్, నర్సింహ,శ్రీను, కృష్ణారెడ్డి, వీరస్వామి, రాంరెడ్డి, దశరథ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.