ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, గ్రామీణాభివృద్ధి, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర శాఖల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు.
మండలాల వారీగా ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులలో ఎంతమంది హమాలిలు ఉన్నారు, ఎన్ని లారీలు ఉన్నాయని తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగంగా జరగాలని, అన్లోడింగ్ ప్రక్రియలో హమాలీల సంఖ్య పెంచుకోవాలని, లారీల సంఖ్యను పెంచాలని, లారీలు అందుబాటులో లేకుంటే డీసీఎంలు, ట్రాక్టర్లను కూడా అనుమతించాలని , అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని,అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడడానికి టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలనీ అధికారులను ఆదేశించారు. మిల్లర్లు అన్లోడింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి లారీలను అందుబాటులో ఉంచలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకటస్వామి, వ్యవసాయ అధికారి దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
1,00,534 మెట్రిక్ టన్నులు కొనుగోలు
జిల్లాలో ఇప్పటి వరకూ 21, 208 రైతుల నుంచి 1,00,534 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 9710 మంది రైతులకు 111.90.కోట్ల రూపాయలు చెల్లించామన్నారు.
ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహించాలి
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును మరింత విస్తరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ సాగు ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తక్కువ వ్యయంతో అధిక లాభాలు అందించే పంటగా ఆయిల్ ఫామ్ రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, ఎరువులు, సాంకేతిక సూచనలు అందించేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post