- రోడ్డుకు అడ్డంగా వేసిన ఫెన్సింగ్ ను తొలగించాలని కలెక్టర్ కు ఫిర్యాదు.
ముద్ర ప్రతినిధి,మేడ్చల్: మేడ్చల్ జిల్లా,శామీర్ పేట మండలం లోని తూంకుంట గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ కాలనీ రోడ్డు ను కబ్జా చేసి అక్రమంగా ఏర్పాటు చేసిన పెన్సింగ్ ను తొలగించి కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రతినిధులు రత్నాకర్ రెడ్డి, పోలి రెడ్డి, శివకుమార్ లు సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి కి ఫిర్యాదు చేశారు.సర్వే నెంబర్లు 286, 332లలోని 8 ఎకరాల 4 గుంటల భూమిలో 2017లో వెంచర్ వేశారు. ఈ వెంచర్ లో 133 ప్లాట్స్ విక్రయించగా అందులో కొంతమంది ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇండ్లను కూడా నిర్మించుకున్నారు.కాలనీ వాసులంతా కలిసి రెడ్డి అసోసియేషన్ పేరిట సోసైటీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల భూముల ధరలు పెరిగడంతో భూయాజమానులు, వెంచర్ నిర్వహకులు మధ్య ఉన్న వివాదాన్ని 7 ఏళ్ల తర్వాత తెరపైకి తెచ్చారు. అప్పట్లో లే అవుట్ లో రోడ్డుగా చూపిన స్థలాన్ని అక్రమించి గూడురి సత్తిరెడ్డి అనే వ్యక్తి ఫెన్సింగ్ వేశాడు. రోడ్డుపైన బోరు వేసి, చెట్లను పెంచుతున్నాడు. రోడ్డు కబ్జాపై రెడ్డి అసోసియేషన్ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా, అసోసియేషన్ కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా అక్రమణదారు కోర్టు ఆదేశాలను లెక్క చేయక.. రోడ్డును తన అధీనంలోనే ఉంచుకున్నాడు.కాలనీవాసులు శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అయినా సత్తిరెడ్డి మాత్రం తన పలుకుబడితో రోడ్డును కబ్జా చేశాడని కాలనీ వాసులు వాపోతున్నారు. జిల్లా అధికారులు వెంటనే కబ్జా దారుల పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.