Take a fresh look at your lifestyle.

క్యాన్సర్ తో కొట్టుమిట్టాడుతున్న వివాహిత యువతి కాపాడేందుకు రక్త దానం చేసిన గ్రామస్తులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వివాహిత యువతి ప్రాణాలు కాపాడేందుకు గ్రామం అంత ఏకమై రక్త దానం చేశారు.
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం భూరుగుపల్లి గ్రామనికి చెందిన శెవ్వ శరత్ బాబు కూతురు కీర్తనను కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పరమళ్ళ గ్రామానికి చెందిన ఈర్ల సంగమేశ్వర్ కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేశారు.

ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. గత నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా కీర్తనకు క్యాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. గత 28 రోజులుగా హైదరాబాద్ లోని ఎంఎన్జే కాన్సర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతుంది. రక్తం అవసరం ఉండటంతో గతంలో అత్తగారి గ్రామం పరమళ్ళలో 100 మంది రక్త దానం చేయగా, ఇంకా అవసరం ఉందని వైద్యులు సూచించడంతో సోమవారం తల్లిగారి గ్రామం భూరుగుపల్లిలో మైత్రి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 60 మంది నుండి రక్తం సేకరించినట్లు సర్పంచ్ సాయిలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.