Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..నియమాలు కఠినంగా అమలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.
మున్సిపాలిటీలకు ఈ నెల 11 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ కి సంబందించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని….ఈ నేపథ్యంలో 09.02.2026 సాయంత్రం 5.00 గంటల నుండి 11.02.2026 సాయంత్రం 5.00 గంటల వరకు నిశ్శబ్ద కాలం (Silent Period) అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమాలు–2019ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు
నిశ్శబ్ద కాలంలోబహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు లౌడ్ స్పీకర్లు, మైకులు, వాహనాల ద్వారా ప్రచారంఇంటింటి ప్రచారం
బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ప్రదర్శించడంసోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలుపూర్తిగా నిషేధం అన్నారు.ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఆయుధాలు నిషేధమని…
ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ కోసం పోలింగ్ రోజున ఎవరూ ఆయుధాలతో పోలింగ్ కేంద్రానికి లేదా దాని పరిసర ప్రాంతాలకు రావడానికి అనుమతి లేదని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.