Take a fresh look at your lifestyle.

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలి : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐ లయ్య

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐ లయ్య అన్నారు.
శనివారం మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి సందర్బంగా భువనగిరి లోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీవాణి,వైస్ చైర్మన్ మంజుల, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేణుక బాబు రావు,గ్రంధాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ,ప్రజా ప్రతినిధులు, బిసి సంఘం సభ్యులతో పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా విప్ మాట్లడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రపంచ మేధావి, విద్యా సంస్థలు నెలకొల్పి విద్యా ద్వారా అన్ని సాధించవచ్చనే ఉద్దేశంతో తన తో పాటు తన సతీమణి కూడా విద్యాభ్యాసం చేసి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పనిచేసారు. బాల బాలికలకు విద్యాభ్యాసం నేర్పించిన ఘనత ఆమెదే అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే మహిళలకు ప్రభుత్వంకు పెద్ద పీట వేసిందని, మహిళల లకు మహాలక్ష్మి పధకం తీసుకొని రావడం జరిగిందని అన్నారు.బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి సంస్కర్తల్లో ఒకరని, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి.సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణకు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను అనుసరించి ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు .
స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లడుతూ సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని తెలిపారు. ఆయన ఆశయంతో మనమందరం ముందుకు వెళ్లాలన్నారు.
అంతకంటే ముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం మహనీయులను స్మరిస్తూ పాడిన పాటలు అందరిని అలరించాయి.
ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి, బి. సి కుల సంఘాల సభ్యులు,వివిధ కుల సంఘాల సభ్యులు, ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.