Take a fresh look at your lifestyle.

అవినీతి అధికారులను వదిలిపెట్టం-* సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్

* రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తే
* చట్ట ప్రకారం బాధ్యత వహించాల్సిందే

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

అవినీతి అధికారులు ఎత్త పెద్ద వారైనా వదలిపెట్టే ప్రసక్తే లేదని సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ విలువైన భూ విషయంలో రికార్డుల నుంచి పేర్ల తొలగింపు విషయమై సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి పై డీవోపీటీలో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అధికార పార్టీ నాయకులకు జేబు సంస్థలకు లాభం చేకూర్చేలా జిల్లా కలెక్టర్ వ్యవహరించి సామాన్యులకు అన్యాయం చేయడం హేయమైన చర్య అన్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి సామాన్యులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అధికార పార్టీ నాయకులను, అధికారులను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తే చట్ట ప్రకారం ఎదురయ్యే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భూ వివాదం లో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.