ముద్ర, శేరిలింగంపల్లి :
6 గ్యారంటీలు, 66 హామీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వెంటనే అమలు చేయాలి…లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు ఇలా పోరాటం ఉధృతం చేయాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి, కొండాపూర్ ,లింగంపల్లి, హఫీజ్ పేట్, మియాపూర్, డివిజన్ల నాయకులు స్థానిక తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవికుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల లో బి.ఆర్.ఎస్ చేసిందేమీ లేదని , రాష్ట్ర ప్రజలను ,ప్రజల ఆస్తులను ఆగం పట్టిస్తున్నారని బీజేపీ పార్టీ పోరాటాలు, ఉద్యమాలు చేస్తే 6 అబద్ధాలు , 66 మోసాల మేనిఫెస్టో తో కాంగ్రెస్ గెలిచిందని, 2 ఏళ్ల పాలన పూర్తయినా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు, ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి తిరుగుతున్నారని తెలంగాణ ఉద్యమకారులకు, 25 వేల పింఛను, ప్రభుత్వ ఉద్యోగం, 250 గజాల ఇళ్ల స్థలం, అవివాహిత మహిళలకు పెళ్లికి రూ.లక్ష, తులం బంగారం, ప్రతి నెల రూ.2500, పేద ప్రజలకు ఫ్రీ బస్సు పేరుతో డ్రైవర్స్ పొట్టకొట్టారని ఆరోపించారు. కనీసం ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12000 ఇస్తానన్న హామీ,కొత్త రేషన్ కార్డులు,పెన్షన్లు ఇవ్వలేదని, పెన్షన్లు 4000, 6000 పెంచలేదని, ఇంటి స్థలం, 5 లక్షలు కూడా ఇవ్వలేదని, విద్యార్థులకు , యువతకు 5 లక్షల విద్య భరోసా కార్డ్ , ప్రతి విద్యార్థినీకి స్కూటీ, నిరుద్యోగులకు 10 లక్షలు వడ్డీ లేని రుణం, 4 వేల నిరుద్యోగ భృతి, ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్స్, బస్తీ పబ్లిక్ స్కూల్స్ , మెగా డీఎస్సీ , జాబ్ క్యాలెండర్ రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని విస్మరించారని విమర్శించారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేవరకు ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు ఇలా ప్రజల తరపున బీజేపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఎల్లేష్, జితేందర్, లక్ష్మణ్ ముదిరాజ్, కిషోర్ ముదిరాజ్, ఆంజనేయులు సాగర్,రమేష్ , విభూషణ్ రెడ్డి, విష్ణు దత్ వెంకటేష్, గణేష్ ముదిరాజ్ ,రాము, శ్రీనివాస్ యాదవ్ పద్మ , విజయలక్ష్మి, జ్యోతి , తదితరులు పాల్గొన్నారు