మహాదేవపూర్, ముద్ర: తెలంగాణ క్రీడా పాఠశాలల లో ప్రవేశానికి అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడిఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణా క్రీడా పాఠశాల ఆహ్వాన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ లో 10 మంది బాలురు మరియు 10 మంది బాలికలు చొప్పున 2026-27 సంవత్సరానికి గాను నాల్గవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక జరుగుతుంది.అర్హులైన విద్యార్థిని, విద్యార్థులు https://tgss.telangana.gov.in/ వెబ్ సైట్ లో తేది : 26.02.2026 నుండి 04.03.2026 లోపు పేరు నమోదు చేసుకోగలరు. అభ్యర్ధుల వయస్సు 4వ తరగతి కొరకు 8 సంవత్సరాలలోపు అనగా 01.09.2017 నుండి 31.08.2018 లోపు మధ్యలో జన్మించి వుండాలి. నాల్గవ తరగతి చదువబోతున్న విద్యార్థులు అర్హులు. మండల స్థాయి పోట్టిలు తేది. 13.03.2026 నుండి 17.03.2026 లోపు మండల విద్య అధికారి ద్వారా నిర్వహించబడును. రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపిక తేది: 27.04.2026 నుండి 01.05.2026 వరకు జరుగును. ఆసక్తిగల విద్యార్ధిని, విద్యార్థులు ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకొని మండల విద్య శాఖ అధికారిని సంప్రదించి పోటిలలో పాల్గొనాలని కోరారు.