ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:
ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర అయిన అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
జాతర ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఐదవ రోజు ప్రధాన ఘట్టమైన ఎడ్లబండ్ల ప్రదక్షణ అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక భక్తులే కాకుండా, వివిధ గ్రామాల కు చెందిన భక్తులు ఎడ్ల బండ్లను పోటాపోటీగా వివిధ రకాలుగా సుందరంగా అలంకరించి డప్పు వాయిద్యాలు, ఆటపాటలతో గ్రామపుర వీధుల గుండా స్వామి వారి ఆలయానికి చేరుకొని బేతాళ స్వామికి గోవిందా.. గోవిందా అంటూ భక్తి పారవశ్యంతో స్మరించుకుంటూ వివిధ రకాల ఆట పాటలు, విన్యాసాలతో ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఎడ్లబండ్ల మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను తిలకించడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుండి భారీ సంఖ్యలో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అసౌకర్యం ఆలయ కమిటీ పలు ఏర్పాట్లుచేసింది. సిఐ రేణుక రెడ్డి, ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జన జాతరగా కిక్కిరిసిపోయింది.