Take a fresh look at your lifestyle.

నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: పోచారం

  • లబ్దిదారులకు పట్టాలు అందజేత.

బాన్సువాడ, ముద్ర: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ అర్బన్,రూరల్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,అర్హులైన వారు ముందుకు వస్తె ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలియజేసారు.ఇళ్ల నిర్మాణం పైన అవగాహన కల్పించారు.తదుపరి బాన్సువాడ పట్టణం కోటగల్లి లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు.బాన్సువాడ అర్బన్ కు 260 మంది,రూరల్ మండలం 353 మంది లబ్ధిదారులకు మొత్తం 613 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ చందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.