- సమీక్షా సమావేశం లో పీయేసి ఛైర్మెన్ గాంధీ.
మాదాపూర్, ముద్ర: వివేకానంద నగర్ లోని పీయేసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం జరిపిన పీయేసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం మరియు ఇతర విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ప్రజలకు ఎల్లవేళలలో అందుబాటులో ఉండాలన్నారు.ప్రజా సమస్యల పై అధికారులు నిర్లిప్తతను విడాలని, మీ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పై స్పందించే అవసరం ఎంతైనా ఉంది అని గుర్తిచేశారు.అధికారులు అన్ని విభాగాలతో సమన్వయం తో పనిచేస్తూ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్లాలని చైర్మన్ గాంధీ సూచించారు.ప్రజావసరాల దృష్ట్యా కాలనీ లలో నెలకొన్న రోడ్ల సమస్యలను ప్రథమ ప్రాధాన్యత గా పరిగణలోకి తీసుకోని త్వరిత గతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని, పనులలో వేగం పెంచాలని అలసత్వం ప్రదర్శిచకూడదన్నారు.రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరం ఉన్న చోట కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని,వర్షాకాలం వచ్చే లోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,అవసరమున్న చోట యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని గాంధీ అధికారులను ఆదేశించారు.అందుబాటులో ఉండి,క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పని చేయాలని, అన్ని కాలనీ లను సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పని చేయాలని, కాలనీ లలో చేపడుతున్న పనులలో వేగం పెంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్. ఈ శంకర్ నాయక్, ఈఈ ప్రసాద్, ఇంద్ర బాయి, డీ ఈలు ఆనంద్, దుర్గ ప్రసాద్, విశాలాక్షి, ప్రశాంత్, ప్రతాప్, సంతోష్ ,సంతోష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.