రామకృష్ణాపూర్, ముద్ర : పట్టణంలోని ఏ జోన్ సూపర్ బజార్ షిరిడి సాయిబాబా ఆలయంలో 25 వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మితమైన దేవాలయంలో కాశీ విశ్వనాథ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో జరిపారు.ముందుగా యంత్ర ప్రతిష్ఠ,దేవతా స్థాపన,ప్రాణప్రతిష్ఠ,మహాబలి హరణ,మహా పూర్ణాహుతి,శాంతి కళ్యాణంతో పాటు అన్నపూర్ణ దేవికి మాతలచే ఒడి బియ్యం,సారే సమర్పించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.
