ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటినుంచి పటిష్ట ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని వివరించారు. వివిధ శాఖల అధికారులతో వారి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనుల గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్వో రాజేందర్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు , ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.