కోరుట్ల/మెట్పల్లి, ముద్ర విలేకరి: మెట్పల్లి పట్టణ జువ్వాడి నర్సింగరావు స్వగృహం జువ్వాడి భవన్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్నీ ఉన్నత పదవులను అందుకోవాలని దేవుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.