- చంచల్ గూడ జైలు ఎస్పీ శివకుమార్ గౌడ్
హైదరాబాద్: మంచి సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని చంచల్ గూడ జైలు ఎస్పీ శివకుమార్ గౌడ్ అన్నారు. సోమవారం జైలు కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందంతో కలిసి ముందడుగు లోగో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో యువత చెడు మార్గాలకు వెళ్లకుండా, మంచి మార్గం వైపు నడిచేలా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందడుగు విభాగాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. గ్రామస్థాయిలో యువతకు సమాజంపై, హక్కులపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలు వారు పరిష్కరించుకునేలా మన వంతు కృషిచేయాలన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందడుగు టీషర్ట్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి, మహిళా చైర్మన్ డా.స్రవంతి, మహిళా అధ్యక్షురాలు గీతానంద్, జాతీయ కార్యవర్గసభ్యులు కొమటి రమేశ్ బాబు, జి. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.