Take a fresh look at your lifestyle.

ఉపాధి కార్మికులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల, పేదల పోట్ట గోట్టడానికి తీసుకువచ్చిన విబి – జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉపాధి హామీ కార్మికులు పనిచేసిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల పని ప్రదేశాన్ని జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్యతో కలిసి సందర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, చీమలకొండూరు సర్పంచ్ పల్లెర్ల అంజయ్య మాట్లాడుతూ నాలుగు నెలలకు పైగా కార్మికులకు చేసిన పనికి డబ్బులు చెల్లించకపోతే కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రామస్వామి, ఉపాధి కూలీలు బోమ్మారపు లావణ్య, శిరిష , లక్ష్మి, స్వాతి, సంగీత, ధనలక్ష్మి, క్రిష్ణ, రాంపల్లి శ్రీలత, లావణ్య,మమత, పల్లెపాటి శోభారాణి, లక్ష్మి, ర్యాకల లావణ్య, వరిగంటి రమాదేవి, లక్ష్మి, లావణ్య, గుండ్లపల్లి జ్యోతి, బీటుకూరు నర్సమ్మ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.