Take a fresh look at your lifestyle.

పదవులు కాదు ముఖ్యం ప్రజా సేవయే లక్ష్యం. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

 

ముద్ర, మోత్కూర్:

మోత్కూర్ మున్సిపాలిటీ 6వ వార్డు అరేగూడెం లో సమాల రామస్వామి రెడ్డి గత 7 సంవత్సరాల నుండి పక్షవాతం తో బాధపడుతూ మంచానికి పరిమితం కావడం తో వారి బాధను చూడలేక  వారికీ సహాయంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య విల్ చైర్ అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మనిషికి నిజమైన సంతృప్తి అని పదవులు కాదు ముఖ్యం ప్రజాసేవే లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం నాగార్జున రెడ్డి, వార్దు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.