Take a fresh look at your lifestyle.

అర్హులైన జర్నలిస్ట్ లకు అక్రిడిటేయేషన్ కార్డుల మంజూరు…-జిల్లాకలెక్టర్, జిల్లాఅక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్ స్నేహశబరీష్..

 

-సమాజానికి ఉపయోగపడే వార్తలు అందించాలి..

-జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…*

మహబూబాబాద్, ముద్రప్రతినిధి:

మహబూబాబాద్ జిల్లాలో 2026-2028 సంవత్సరానికి సంబందిచిన మీడియా అక్రిడిటేయేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్ స్నేహ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాకలెక్టరేట్ సమావేశమందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లామీడియాఅక్రిడిటేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ స్నేహశబరీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ..సందర్భంగా నూతన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ కు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేసారు.


నూతన కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ శుభాకాంక్షలు తెలిపారు.
దరఖాస్తుల సంఖ్య, పరిశీలన విధానం గురించి డీపీఆర్ఓను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన నిజమైన జర్నలిస్టులకే అక్రిడియేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా (447) ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయని, అట్టి దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, బాధ్యతాయుతంగా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలన్నారు. అక్రిడియేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి దశలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్నేహశబరీష్ తెలిపారు.
ఈ.. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీపీఆర్ఓ పి రాజేంద్రప్రసాద్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, ఈరగాని బిక్షం, వేముల అయోధ్యరామయ్య, నవాబ్, షేక్ అక్రం, ఎం మోహన్ రెడ్డి, గాడిపల్లి శ్రీహరి, ఉమ్మగాని మధు, ఉప్పల రంగ, సిబ్బంది రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.