Take a fresh look at your lifestyle.

1.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.150.82 కోట్లు రైతుల ఖాతాలలో జమ కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో ఇప్పటి వరకు 27,314 మంది రైతులు నుండి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. 13099 రైతులకు 150.82 కోట్లు వారి అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. కౌడిపల్లి మండలం మమ్మద్ నగర్ లో శ్రీనివాస ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కువకాలం కేంద్రాల వద్ద నిల్వ ఉంచకుండా వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం స్టాక్ పెండింగ్‌లో లేకుండా చూడాలని తెలిపారు.
ప్రస్తుతం రోజుకు సుమారు 600 లారీల ద్వారా ధాన్యం రవాణా వేగవంతంగా జరిగేందుకు ఆర్టీఓ శాఖ, రవాణా ఏజెన్సీలకు సూచించారు.
కొనుగోలు కేంద్రానికి సమీపంలోనే రైస్ మిల్లులు ఉన్నచో ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యాన్ని తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా, లిఫ్టింగ్ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. వెంట నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, డిఎం జగదీష్, తహసిల్దార్ కృష్ణ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.