Take a fresh look at your lifestyle.

కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దు పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావాలని, ప్రతీ అధికారి కేంద్రాలని సందర్శించి కొనుగోలు ప్రక్రియ సాఫిగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటివరకు
ఎంత ధాన్యం వచ్చింది, ఎంత తూకం వేశారు, ఎంత మంది హమాలీలు ఉన్నారు, సరిపడా గన్ని బ్యాగ్ లు, టార్ఫాలీన్ లు ఉన్నాయా, లారీలు వచ్చాయా లేదా, లోడింగ్ కి ఎంత టైం తీసుకుంటున్నారు, ట్యాబ్ ఎంట్రీ ఎలా చేస్తున్నారు అని వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం రాగానే ఎలాంటి ఆలస్యం లేకుండా కొనుగోలు అవ్వాలని, సరిపడా హమాలీలను పెట్టుకొని కొనుగోలు అయిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు.
మిల్ కి వెళ్లే ట్రక్ లో కేంద్రానికి సంబందించిన ఒకరిని కూడా పంపించి, అక్కడ ధాన్యం త్వరగా ఆన్ లోడ్ అయ్యేలా చూసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.