Take a fresh look at your lifestyle.

మంజీరిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంజీరిక ప్రత్యేక సాహిత్య సంచికను ప్రిన్సిపాల్ డా. హుస్సేన్ ఆవిష్కరించారు. సంపాదక మండలిని ప్రిన్సిపాల్ అభినందించారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వామన మూర్తి మాట్లాడుతూ… కళాశాల ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థుల చేత రచించిన సృజనాత్మకమైన కవితలను కథలను కలిపి సంచికను వెలువరించడం సంతోషం కలిగించిందన్నారు. సృజనాత్మక రంగంలో విద్యార్థులను ప్రోత్సహించుటలో తెలుగు శాఖ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక సంచిక డాక్టర్ వామనమూర్తి, డాక్టర్ ప్రవీణ్ కుమార్, వేణుగోపాల శర్మ సంపాదకీయంలో వెలువరించినట్టు తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ సింహారెడ్డి, ఐక్యుఎసి కో-ఆర్డినేటర్ తిరుమలరెడ్డి, అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శరత్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.