బెస్ట్ అవైలబుల్ పాఠశాల్లో ప్రవేశం కోసం లక్కీ డిప్ ద్వారా ఎంపిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
నిరుపేదలైన గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని
అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రభుత్వ లక్షాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
గురువారం గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశాల కోసం లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన
ఈ పథకంలో విధ్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను భోదించడంతో పాటు వారికి అవసరమైన భోజన, వసతి సౌకర్యాలను కూడా పూర్తిగా ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వి .నీలిమ, గిరిజన వసతి గృహ అధికారులు డి. లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.