Take a fresh look at your lifestyle.

సివిల్స్ లో అటెండర్ కుమారుడి సత్తా

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా మనోహరాబాద్  మండలం పోతారం గ్రామానికి చెందిన యువకుడు సివిల్స్ లో సత్తా చాటాడు. గ్రామానికి చెందిన కుమ్మరి యాదగిరి, జ్యోతి కుమారుడైన కుమ్మరి శ్రావణ్ కుమార్ యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో 768 ర్యాంక్ సాధించారు. కాగా గ్రూప్ -1 ఫలితాల్లో కూడా విజయం సాధించి ఇటీవలే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఏడాది క్రితం శ్రవణ్ తల్లి జ్యోతి బస్ ప్రమాదంలో మరణించింది. కాగా తండ్రి యాదగిరి ఓ ప్రైవేట్ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.