Take a fresh look at your lifestyle.

తారాడిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ప్రారంభోత్సవం

 

ముద్ర సంగారెడ్డి,
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రోజు ప్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రవీణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రత్యేకంగా విద్యాశాఖ అభివృద్ధికై ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమములో భాగంగా 10 రోజుల అభివృద్ధి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,ఈ పది రోజుల్లో చేపట్టవలసిన అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మొదటి రోజైన శుక్రవారం కార్యక్రమంలో భాగంగా అధ్యాపక బృందము, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యారెట్లు,విద్యార్థిని విద్యార్థులు కళాశాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందని, కళాశాలలో వృధాగా పేరుకుని పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని తొలగించడం జరిగిందని,దీనివల్ల పర్యావరణ పరిశుభ్రత ఏర్పడి పర్యావరణంలో సమతుల్యత ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలిపినారు.ఈ పది రోజులలో నిర్వహించవలసిన కార్యక్రమ ప్రణాళికను తయారు చేసుకోవడం జరిగిందన్నారు.పది రోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కళాశాలలో అన్ని రకాలైన రికార్డులను తయారు చేయడము,సైన్స్ విభాగాల లేబరేటరీ సదుపాయాలను మెరుగుపరచడం,కళాశాలలో వివిధ విభాగాలలో చేయవలసిన రిపేర్లను చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందము ఎన్ఎస్ఎస్ అధికారులు ఎన్సిసి అధికారి,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.