Take a fresh look at your lifestyle.

పాలిటెక్నిక్ తో అనేక ఉద్యోగాలు లభిస్తాయి.           

  • సింగరేణి అఫిషియేటింగ్ జీఎం రాముడు. 

యైటింక్లయిన్ కాలని. ముద్ర: సింగరేణి రామగుండం రెండవ డివిజన్ అఫిషియేటింగ్ జనరల్ మేనేజర్ ఎం.రాముడు గురువారం సింగరేణి సెక్టార్.3 పాఠశాల విద్యార్థులకు పాలీసెట్ శిక్షణా తరగతుల ప్రారంభించారు. సింగరేణి సంస్థ ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశాల మేరకు ఉదయం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఫిషియేటింగ్ జీఎం శిక్షణా తరగతులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ ద్వారా అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, దూర ప్రాంతాలకు వెళ్లకుండా, కాలనీ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేవిధంగా సింగరేణి యాజమాన్యం స్తానిక సెక్టార్-3 పాఠశాలలో ఉచితంగా ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిందన్నారు. శిక్షణా తరగతులు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది నిరుపేద విద్యార్థుల కు చాలా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సింగరేణి పాఠశాల విద్యార్థులు, సంస్థ ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని మంచి ర్యాంకులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిమ్ డీజీఎం ఎస్డీ.ఎం.హుస్సేన్, డివైపిఎం వంశీధర్, పాఠశాల హెడమాస్టర్ ఎన్.సుందర్ రావు, ఉపాధ్యాయులు పి.రమేష్, నాంచారయ్య ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.