-పోలింగ్ బూత్ తారుమారు -బూరుగుపల్లి, గంగారం ఓటర్ల మనోగతం
*-కావాలనే చేశారంటన్న బిఆర్ఎస్ నాయకులు -చేతులెత్తేసిన అధికారులు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు ప్రజలు పోలింగ్ బూతులు తారుమారు కావడంతో మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల తప్పించడం వల్ల 1600 మంది ఓటర్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బూరుగుపల్లి గ్రామంలో ఉండాల్సిన పోలింగ్ బూతు గంగారం సాయిబాబాలో ఏర్పాటు చేశారని గంగారం సాయిబాబా కాలనీలో ఉండాల్సిన పోలింగ్ బూత్ బూరుగుపల్లిలో ఏర్పాటు చేశారని పోలింగ్ తారుమారు వల్ల 1600 మంది ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ నాయకులు అనంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ తో చర్చించగా పోలింగ్ బూత్ మార్చే విషయం మా చేతుల్లో లేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మీ తప్ప పోలింగ్ బూత్ ను మార్చే ప్రసక్తి ఉండదని మున్సిపల్ కమిషనర్ తేల్చి చెప్పినట్లు విఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు ఇది కావాలని స్పీకర్ సహాయంతో ఇబ్బందుల గురి చేసేందుకు ఇలా మార్చారని డిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బూరుగుపల్లి గ్రామస్తులు గంగారంలో ఓటు హక్కు వినియోగించాల్సి ఉండగా గంగారం గ్రామస్తులు బూరుగుపల్లిలో ఓటు వేయాల్సి ఉంది. ఇక్కడి నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి ఎలా వెళ్లాలంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన కూతురు అనే నేను మున్సిపల్ చైర్పర్సన్ చేసుకునేందుకే ఈ విధంగా ఓటర్లు ఇబ్బందులు గురి చేసేందుకు పోలింగ్ కేంద్రాలను తరమర్ చేయించారని బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అనంత్ రెడ్డిలో తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ పోలింగ్ తారుమారుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ తో మాట్లాడినట్లు తెలిపారు అయితే పోలింగ్ బూత్లను మార్చే పరిస్థితి లేదని ఓటర్లకు కావలసిన వస్తువులు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.