Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్ లో జాతీయ మహిళా సదస్సు

  • జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది
  • ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గం విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐజేయు అధ్యక్షులు, మీడియా అకాడమీ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల అంశాలు త్వరలో పరిష్కారం అవుతాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు . ఫిబ్రవరిలో హైదరాబాదులో నిర్వహించే మహిళా జర్నలిస్టుల సదస్సుకు వివిధ రాష్ట్రాల నుండి మహిళా జర్నలిస్టులు పాల్గొంటారని చెప్పారు.
ఇటీవల మరణించిన జర్నలిస్టులకు సమావేశం సంతాపం వ్యక్తం చేసింది.

రాష్ట్ర కార్యవర్గంతో పాటు, 30 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి తగు కార్యాచరణ పై దాదాపు 5గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది., పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది.

మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలో అకాల మరణం చెందిన 17మంది పాత్రికేయులకు నివాళి అర్పిస్తూ, సంతాప సూచికగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. సమావేశంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణ, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, నగునూరి శేఖర్, టీయుడబ్ల్యూ జె డిప్యూటీ జనరల్ సెక్రటరీ కే. రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.