Take a fresh look at your lifestyle.

మాస్ లైన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం 

  • పెంచిన గ్యాస్ , డిజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్.

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: అంతర్జాతీయంగా డీజిల్ గ్యాస్ ధరలు తగ్గినా, దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం మోపడం దుర్మార్గమైన చర్యని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కే .రంగారెడ్డి అన్నారు.కేంద్రం గ్యాస్ ధరలు 50 రూపాయలు, డీజిల్,పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ గురువారం భద్రాచలంలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పేదలకు ఈ ధరల పెంపు మరింత భారమైందన్నారు.పెంచిన ధరలు తగ్గించకపో తే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిపి పోరాటం ఉదృతం చేస్తామని రంగారెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు ముద్దా భిక్షం, కల్పన, సాయన్న, మునిగేలా శివ, ప్రశాంత్, మునిగేలా మహేశ్వరి, దండుగుల రాంచరణ్, మడకం భీమరాజు, మంచాల నరసింహా రావు, శాంతక్క , కుమారి ,కృష్ణ కుమారి, అనురాధ, సత్యవాణి, నసీమా, రమా, బుజ్జమ్మ, భాష, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.