ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఒక అత్యుత్తమ విద్య శిక్షణా సంస్థ – ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు
ముద్ర ప్రతినిధి,హైదరాబాద్:
ఒక శిక్షణ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా అత్యున్నత కార్పొరేట్ సంస్థలతోను, బహుళహజాతి కంపెనీలతోను మంచి పేరు తెచ్చుకుని ఆయా శాఖలకు చెందిన తమ సిబ్బిందికి మరింత అడ్వాన్సుడ్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకు శిక్షణ కోసం పంపించడం తాను గర్వ కారణంగా భావిస్తున్నానని, ఇందుకు ఎస్కీ లో అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే కారణం అని కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు అన్నారు.

ఎస్కీ లోని సివిల్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్, మేనేజిమెంట్ అండ్ టెక్నాలజీ, క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్స్ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను రామేశ్వర రావు సోమవారం 4 మే, 2026న ఎస్కీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఇంజనీరింగ్ సిబ్బందికి ఈ సందర్బంగా ఆయన ధన్యవాదాలు తెలియచేసారు.

అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రజ్ఞులు ఫ్యాకల్టీ లుగా పనిచేసిన హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా శిక్షణ సంస్థకు 45 సంవత్సరాల అనుభవం ఉన్నదని గత తొమ్మిది నెలలుగా దేశంలోని డిస్కం ఇంజనీర్లకు రేనివబుల్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ ఎనర్జీ పోర్ట్ ఫోలియో మానేజ్ మెంట్, వాటిపై శిక్షణ ఇస్తోందని, మధ్య ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఇంజనీర్లకు స్ట్రక్చరల్ డిజైన్స్, క్వాలిటీ అస్యూరెన్సు వాటిపైన శిక్షణ ఇస్తుంటే, డిఫెన్స్ రంగంలోని ఏరో స్పేస్ ఇంజనీరింగ్ ఇంజనీర్లకు క్వాలిటీ మేనేజిమెంట్ ఫర్ రూట్ కాజ్ ఎనాలిసిస్ పైన శిక్షణ ఇస్తున్నామని, ఇంధనం, లూబ్రికెంట్స్ రంగంలో పేరున్న షెల్ ఇండియా సంస్థ లోని ఇంజనీర్లకు కంప్రెసర్స్, గ్యాస్ టర్బైన్స్ సంబంధించి డిజైన్, ఆపరేషన్, ట్రబుల్ షూటింగ్ వాటిపైన శిక్షణ ఇస్తున్నామని, వారం రోజులపాటు సాగే ఈ అత్యుత్తమ శిక్షణ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఇంజనీరింగ్ సిబ్బందికి డైరెక్టర్ ఈ సందర్బంగా కృతఙ్ఞతలు తెలియచేసారు.

సమావేశంలో మేనేజిమెంట్ టెక్నాలజీ హెడ్ డాక్టర్ యూ. జ్యోతి, క్వాలిటీ అండ్ ప్రాడెక్టివిటీ హెడ్ ఈ. రామ్ కిషోర్, పవర్ అండ్ ఎనర్జీ ఇంచార్జ్ డాక్టర్ విద్యాసాగర్ లతో పాటుగా సీనియర్ ఫ్యాకల్టీలుగా రెహాబ్ టెక్నాలజీస్ సీఈఓ డాక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, హిందూస్తాన్ అకాడమీ కౌన్సిల్ ఆఫ్ లా మేనేజింగ్ పార్టనర్, లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ నిపుణులు వి. పార్వతీశం, సెంట్రిఫిగల్ కంప్రెషర్స్ గ్యాస్ టర్బైన్స్ నిపుణులు భెల్ సీనియర్ ఇంజనీర్ ఎం. హరికృష్ణ, క్వాలిటీ కంట్రోల్ ఫోరం ఆఫ్ ఇండియా మెంబర్ ఎం.వి.వి. రవి కుమార్ లతో పాటుగా వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ఇంజనీరింగ్ సిబ్బంది, ఎస్కీ హెడ్స్ కె.జె అమర్ నాథ్, అనితా అగర్వాల్, సాయి కిషోర్, సి.హెచ్ తిలక్, జి.నరేష్, ఎస్.లక్ష్మి కాంత రావు, డాక్టర్ పి రాజారావు తదితరులు పాల్గొన్నారు.