ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి కవయిత్రి మొల్లమాంబ 586 వ జయంతి ఉత్సవాలను జిల్లా తెలంగాణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంఘం (కేవా) సంయుక్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మొల్ల విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
కుమ్మర సామాజిక వర్గానికి చెందిన మొల్ల రామాయణాన్ని ఆరు కాండలలో 871 పద్యాలతో, వ్యవహారిక భాషలో కేవలం ఐదు రోజులలో రచించారని, వీరు అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వం మొల్ల జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి బుచ్చన్న, కొత్తపల్లి గంగాధర్, పోతుగంటి సాయన్న, తోడిశెట్టి పరమేశ్వర్, మారుపాక శ్రీనివాస్, తోడిశెట్టి రవికాంత్, చంద్రయ్య, శంకర్, మల్లేష్, రమేష్, సాయికుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.