Take a fresh look at your lifestyle.

గో- వృషభ కళ్యాణ మహోత్సవం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: 

పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో నిర్వహించిన గో – వృషభ కళ్యాణ మహోత్సవం
కార్యక్రమంలో నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సతీమణి సరిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు గోపూజ నిర్వహించి, గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు
అనంతరం గ్రామ ప్రజలతో కలిసి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. తదనంతరం ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు


ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర,వైస్ చైర్మన్ బాదం రమేష్,స్థానిక కౌన్సిలర్స్,గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.