Take a fresh look at your lifestyle.

ఢిల్లీ నుండి గల్లీకి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకే ఉంది-కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…

కరీంనగర్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్

ఓడిపోతుందని తెలిసే కరీంనగర్ కు సీఎం రాకుండా పారిపోయారు

ఎంఐఎంకు కాంగ్రెస్ మేయర్ పదవి ఆఫర్

ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం

గంగుల నీ ముఖం మోదీకి తెలుసా?

కేంద్రం నిధులిస్తే… అవి మేమే తెచ్చామనడానికి సిగ్గు లేదా?

కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి?

ఢిల్లీ నుండి గల్లీకి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకే ఉంది

కరీంనగర్ 10, 11 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారీ ఒప్పదం చేసుకుందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కు కేంద్రం నుండి నిధులు తెచ్చి నేను అభివ్రుద్ధి చేస్తే… మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ నిధులు తామే తెచ్చానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ‘‘గంగులా నేనడుగుతున్నా… నువ్వెవరో మోదీకి తెలుసా? నీ ముఖం ఎన్నడైనా చూసిండా? బీఆర్ఎస్ అడిగితే నిధులిస్తారా? బీజేపీ అడిగితే నిధులిస్తారా? అసలు అవన్నీ కేంద్ర నిధులా కాదా?’’అని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం 10, 11, 55, 37, 48, 21, 22 డివిజన్ల అభ్యర్థులు డి.శంకర్, పండుగ స్వప్న, గుగ్గిళ్లపు మంజులా రమేశ్, కోడూరి ఏపీపీ చంద్ర టింకు, కర్ర పద్మ, కొండపల్లి సతీష్, బండ రమణారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆయా స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..

మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇయాళే నిద్ర లేచినట్లుంది. కేంద్ర నిధులు తెచ్చి అభివ్రుద్ధి పనులు చేయించి నేను బుక్ లెట్ ఇంటింటికీ పంపిస్తుంటే… వాళ్లకు భయమేసి ఇప్పుడు కరపత్రం కొట్టించి మేమే కేంద్రం నుండి నిధులు తెచ్చారని చెప్పడం సిగ్గు చేటు. నేనడుగుతున్నా… గంగులా.. నీ ముఖం మోదీకి తెలుసా? నిన్ను గుర్తుపడతారా? బీజేపీ కాకుండా బీఆర్ఎస్ అడిగితే నిధులు ఇస్తారా?… మోదీ నన్ను పిలిచి శభాష్ అని అభినందించి కరీంనగర్ కు అడిగిన నిధులు ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా కరీంనగర్ కార్పొరేషన్ కు రూ.50 కోట్ల నిధులు వచ్చి రడీగా ఉన్నయ్.

నేను నిధులు తెస్తే… గంగుల కమలాకర్ మనుషులు కబ్జాలు చేయడం తప్ప చేసిందేమి లేదు. పేదోళ్లు జాగాలు కబ్జా చేయించిన 9 మంది కార్పొరేటర్లను నేనే జైల్లో వేయించా. 10వ వార్డులో ఉన్న వ్యక్తి కూడా కబ్జా చేస్తే జైలుకు పంపాలని అనుకుంటే మానవత్వంతో వదిలేయాలని డి.శంకరన్న కోరితే వదిలేసిన. అట్లాంటి కబ్జాకోర్లను గెలవనిద్దాం.

కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విషయం తెలియడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాకుండా చొప్పదండిలో మీటింగ్ పెట్టి అటు నుండి అటు పారిపోయిండు. ఇగ ఇక్కడున్న కాంగ్రెస్ నేతల గురించి చెప్పాల్సిన పనే లేదు. అట్లాంటి పార్టీకి ఎందుకు ఓటేయాలి? 6 గ్యారంటీలను అమలు చేశారా? పేదలకు ఇండ్లు ఇచ్చారా? మహిళలకు రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.6 వేలు ఇచ్చారా? పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే ఎన్నికలైన వెంటనే ఇంటి పన్ను, నల్లాపన్ను సహా అన్ని రకాల పన్నులు పెంచి ప్రజల నడ్డి విరగ్గ్గొడతారు. ఆఖరికి రోడ్డుపై నడవాలంటే కూడా పన్నులు బాదుతారు జాగ్రత్త.

Leave A Reply

Your email address will not be published.