ముద్ర, వనపర్తి :
వేసవిలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు నడుం బిగించాలని, అప్రమత్తంగా ఉండి సమస్యలను ఎప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చేతకాకపోతే సెలవు పై వెళ్లండని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వనపర్తి పట్టణంలోని తాగునీటి సరఫరాపై శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి బుధవారం మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాగునీటికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. రామన్ పాడు, ఎర్రగట్టు, కానాయపల్లి, గుంపుగట్టు ల నుంచి సరఫరా అయ్యే నీటి వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు.
పలుచోట్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడి నట్లు ఆయన గుర్తించారు.
రామన్పాడు తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలకు సంబంధించి ఎప్పుడు సమస్యలనప్పుడే పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని SE తిరుపతయ్యను ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
మిషన్ భగీరథ కి ఎమ్మెల్యే ప్రత్యేకంగా సూచించారు.
మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు అసలు నియమించిన 74 మంది ఉద్యోగస్తులు ఇతరత్రా పనులు చేస్తున్నారని, వారిని వెంటనే మాన్పించి కేవలం తాగునీటి సరఫరా పనిని అప్పగించారని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
వాటర్ లైన్మెన్ లతో మాట్లాడి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. పట్టణంలోని కాలనీలలో గల నల్లాలకు ఆఫ్ ఆన్ నియంత్రిక లేకపోవడంతో తాగునీరు వృధా అవుతుందని లైన్మెన్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 200 బోర్లు ఉన్నాయని అందులో కొన్నిట్లలో మోటర్లు లేక నిరుపయోగ ఉన్నాయని ప్రతి బోర్డు వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బుగ్గపల్లి తండా, గుంపుగట్టు వద్ద ఎలాంటి విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మున్సిపాలిటీలో కావలసినంత మ్యాన్ పవర్ పెంచుకోవాలని, ఎక్కడ సమస్య ఉన్న వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. అధికారులు ప్రతిరోజు జరిగే రోజువారి వివరాలను మున్సిపల్ చైర్మన్ కి ప్రతిరోజు వివరించాలని,
అదేవిధంగా ప్రత్యేక సమయం కేటాయించుకుని పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే అధికారం సూచించారు. పని చేయాలనుకుంటే పాత పద్ధతులు మానుకోవాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తాగునీటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post