Take a fresh look at your lifestyle.

మెదక్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం

  • కౌడిపల్లిలో అందజేసిన ఎమ్మెల్యే, కలెక్టర్.

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఆహార భద్రత రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. శుక్రవారం కౌడిపల్లి మండలం రైతు వేదికలో ఆహార భద్రత కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల వంటివి పేదల ఆత్మగౌరవం పెంచే కార్యక్రమాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 2508 కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, వీటితోపాటు 10 వేల 500 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్చడం జరిగిందన్నారు.ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు ప్రతి ఒక్క పౌరునికి ప్రామాణికంగా చెప్పుకోవచ్చన్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం శుభపరిణామం అన్నారు.సీఎంఆర్ఎఫ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, అనేక సంక్షేమ పథకాలకు ఆధారం రేషన్ కార్డు అన్నారు,వడ్డీ లేని రుణాలు నర్సాపూర్ నియోజకవర్గంలో మహిళలందరికీ అందించాలన్నారు. అనంతరం కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జిల్లా గ్రంథాలయం సంస్థ అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి, ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, తసిల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.