ముద్ర ప్రతినిధి, నిర్మల్:
చాలాకాలంగా ఆశ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం వంటావార్పు, రాత్రి బస నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రాగానే ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని అన్నారు. ప్రభుత్వం రెండు సంవత్సరాలు దాటుతున్నా సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారని విమర్శించారు. హామీలు వెంటనే అమలు చేయాలని అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆశలకు పెండింగ్ లో ఉన్న పారితోషకాలు వెంటనే చెల్లించాలని, నిర్ణీత వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, లేదంటే అసెంబ్లీ అసెంబ్లీని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తుడసం శంభు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి గంగామణి, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి సుజాత, జిల్లా కోశాధికారి లక్ష్మి, ఉపాధ్యక్షులు విజయ, చంద్రకళ,సుగుణ ఇంద్రమాల, నంద, జిల్లా సహాయ కార్యదర్శులు సరిత, అనసూర్య, మౌనిక, కమల, రామలక్ష్మి, మంగ, శ్యామల,పద్మ, తదితరులు పాల్గొన్నారు,