Take a fresh look at your lifestyle.

నిమిషాంబిక మాతకు ప్రత్యేక పుష్పార్చన

బోడుప్పల్, ముద్ర విలేకరి: సోమవంశ క్షత్రియ నకాష్ కులస్తుల కులదేవత, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మాత నిమిషాంబిక దేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం వేలాదిగా మహిళలు లలిత పారాయణం చేస్తుండగా అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అర్చక స్వాములు పుష్పార్చన నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం ఆలయానికి హాజరైన భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు, ట్రస్ట్ ధర్మకర్తలు ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), బి. హిమచందర్, డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్ . రామకృష్ణ, వై. చంద్రశేఖర్, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణ ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమకాంత్ శర్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.