Take a fresh look at your lifestyle.

బ్రాహ్మణ ఆర్థిక సంఘ ఆధ్వర్యంలో వన భోజనాలు

కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల బ్రాహ్మణ ఆర్థిక సంఘ ఆధ్వర్యంలో మండలంలోని గుమ్లాపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఆశాఢమాస సందర్బంగా వనభోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిభా పురస్కారాలలో భాగంగా పదవ తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు పాలెపు కార్తికేయ, సహస్ర, సలక్షణ, సౌఖ్య, సుశాంత్, శ్రీవర్షిణి, శ్రీనిధి, హాసిని, శ్రీనుత లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఇటీవల ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసిన చిలుక మర్రి శ్రీనివాస్ ఆచార్యులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ఆర్థిక సంఘ అధ్యక్షులు పాలెపు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ సంఘ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలనుండి సంఘ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇక ముందు కూడా విద్యార్థుల ప్రతిభను చాటే కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘ చైర్మన్ బ్రహ్మన్న శంకర్ శర్మ, గౌరవ అధ్యక్షులు సేనాపతి ప్రవీణ్ ఆచార్య, ప్రధాన కార్యదర్శి నితిన్ కుమార్, కోశాధికారి స్వరాజ్, కిషన్ శర్మ, రమేష్ శర్మ, అరుణ్ శర్మ, ఫణింద్ర శర్మ, మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.