Take a fresh look at your lifestyle.

భాగ్యనగరం చుట్టున్న భూమలపై మంత్రుల కన్ను

  • సంగారెడ్డి, రంగారెడ్డి, శంకరపల్లి, రామచంద్రాపురం మండలాల్లో భూ వివాదాలు
  • మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి
  • గిరిజనులపై కేసులు ఎందుకు పెట్టారు?
  • రూ.1200 కోట్ల విలువైన భూమిని కాజేస్తున్నారు
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : భాగ్యనగరం చుట్టూ ఉన్న భూములపై మంత్రుల కన్నుపడిందని బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్ రావు ఆరోపించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, శంకరపల్లి, రామచంద్రాపురం మండలాల్లో భూ వివాదాలు చాలా రోజులుగా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ఒక రంగు పార్టీ అధికారం కోల్పోయి, మూడు రంగుల పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ భూవివాదాలు సమసిపోలేదన్నారు.

ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు.. హైదరాబాద్ రింగ్ రోడ్డు సమీపంలోని 85 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చుకునే ప్రయత్నం ఓ మంత్రి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శంకరపల్లి మండలం కొండకల్, రామచంద్రాపురం మండలంలోని వెలిమల గ్రామ శివారు మధ్యలో ఉన్న 429 ఎకరాల భూమిని రంగారెడ్డి జిల్లాకు చెందిన భూసామి కేవీ నర్సింహారెడ్డి 1979లో ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ప్రభుత్వానికి ఇచ్చారని ఎంపీ రఘునందన్ తెలిపారు. అయితే ఆ భూమిలో 180 ఎకరాలను వివిధ పరిశ్రమలకు ఏపీఐఐసీకి కేటాయించారన్నారు.

అలాగే వివిధ రకాలుగా కొంత భూమి పోగా మిగిలిన 85 ఎకరాల భూమిని దున్నకుంటున్న గిరిజనులు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. అయితే సుమారు రూ. 1200 వేలు విలువైన 85 ఎకరాలను కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే గిరిజనులపై 17 కేసులు పెట్టారన్నారు. వెలిమాల శివారులో సంగారెడ్డి పోలీసులు మూడు రోజులుగా డ్యూటీ చేస్తున్నారని, ఆ గ్రామంలో ఎవరు ఉండకుండా ఖాళీ చేయించి 85 ఎకరాలను పోలీసుల రక్షణలో కబ్జా చేస్తున్నారని ఎంపీ రఘునందన్ తెలిపారు. ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ తమ వద్దనున్నాయని, గిరిజనులపై కేసులు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వెలిమాల గ్రామంలో సాగులో ఉన్న 85 ఎకరాల భూమిని సందర్శిస్తామని ఆయన వెల్లడించారు. కబ్జాలో ఉన్న గిరిజన భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలన్నారు. వెలిమాలను మరో లగచర్లగా మార్చవద్దని ఎంపీ రఘునందన్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.