ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూల్:
రంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు నిర్వహించిన దాడిలో వెల్జాల్ గ్రామ సెక్రటరీ ఎం. శరత్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఈ విషయాన్ని ఎసిబి రంగారెడ్డి డీఎస్పీ ఏ.పీ. ఆనంద్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఒక వ్యక్తి ప్లాట్‌కు సంబంధించిన పేరు మార్పిడి (మ్యూటేషన్) ప్రక్రియ పూర్తిచేయడానికి శరత్ కుమార్ రూ.30,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు.
దీనిపై బాధితుడు ఎసిబిని ఆశ్రయించగా, అధికారులు ఉచ్చుపన్ని రూ.20,000 లంచం తీసుకుంటున్న సమయంలో శరత్ కుమార్‌ను పట్టుకున్నారు.
అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ లో తన నివాస గృహమునందు తనిఖీలు నిర్వహిస్తున్నారు