Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి..

బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యే వరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలి..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..

ధర్మపురి:

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శనివారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా
గోదావరి నదిలో పారిశుద్ధ్య పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తాగునీటి విషయంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి మంత్రి ఆదేశించారు.

కల్యాణం జరిగే చోట ఉన్న పోల్స్ తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్టీసీ బస్సులు రాత్రి, పగలు తేడా లేకుండా అందుబాటులో బస్సులు నడిపించాలని మంత్రి ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలకు అవసరమైన నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యే వరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.

వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేడారం జాతరకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలకు సైతం నిధుల విడుదలకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

గోదావరి పుష్కరాలను విజయం చేయడానికి సలహాలు సూచనలు చేయాలని మంత్రి కోరారు. ధర్మపురి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీఈడీ డీఈడీ కళాశాల ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాలను విద్యా వంతులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యమని మంత్రి తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ సత్య ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు బ్రహ్మోత్సవాలు సెమీ ఫైనల్ గా భావించాలని కలెక్టర్ అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ గోదావరి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్ లతో పాటు ఎన్ ఎస్ ఎస్ మరియు ఎన్ సీసీ వాలిం టర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. బాలింతలు చిన్నారులకు పాలు ఇవ్వడానికి ఫీడింగ్ రూం ఏర్పాటు చేయాలని కోరారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్ మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున హాజరు అవుతారని అన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు లక్ష మందికి అన్నదానం చేయడానికి వ్యాపారులు ముందుకు వచ్చారని తెలిపారు. తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి సూచించారు.

జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ 350 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. వీరు ఆలయం, గోదావరి నది తదితర ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం 70 కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తామని ఎస్పీ తెలిపారు. షీ టీంతో పాటు ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ సుప్రియ మాట్లాడుతూ ధర్మపురి ప్రజలు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సహాయం అందిస్తారని ఇదే పద్దతి కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.