Take a fresh look at your lifestyle.

అప్పుల్లో తెలంగాణ రైజింగ్​

  • అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులే.
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తారు.
  • అప్పుల అప్పారావు.. రొటేషన్​ చక్రవర్తిలా ప్రభుత్వ పరిస్థితి.
  • గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల విధ్వంసంతో రాష్ట్రం అప్పుల కుప్ప.
  • అదే దారిలో ఈ ప్రభుత్వం నడుస్తున్నది.
  • బడ్జెట్​ చర్చలో బీజేపీఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్​ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్‌ చక్రవర్తిలా ఉందని, రాష్ట్ర దుస్థితికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్​ అయితే..రెండో ముద్దాయి కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. 15 నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.1.63 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అప్పులు చేయటంలో మాత్రమే తెలంగాణ రైజింగ్‌ కనిపిస్తోందని ఏలేటీ మహేశ్వర్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • గత ప్రభుత్వ పాలన ఫలితమే

గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల విధ్వంసం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఇప్పుడు గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం నడవటం బాధాకరమని ఏలేటీ మహేశ్వర్​రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దని, కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు బీఆర్​ఎస్​ విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై ఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్​ చేశారు. గత ప్రభుత్వం 11 శాతానికి తెచ్చిన వడ్డీలను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారో.. లేదో? చెప్పాలని, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారని ఏలేటి ప్రశ్నించారు.తాజాగా డీలిమిటేషన్‌తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని, కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయని, డీలిమిటేషన్‌ మీద రాహుల్‌గాంధీ వైఖరి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చింది.ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డీలిమిటేషన్ అని కొత్తరాగం అందుకుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు కావడం లేదని, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఏవి అని ఏలేటీ మహేశ్వర్​రెడ్డి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.