Take a fresh look at your lifestyle.

దేశం పరువు తీయడం రాహుల్ గాందీ కి  అలవాటే

  • రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని.
  • బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం.

గొల్లపల్లి, ముద్ర: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాహుల్ మానసిక పరిపక్వతకు నిదర్శనమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం విమర్శించారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని భారత సమాజానికి రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సత్యం డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడడం రాహుల్ కు అలవాటేనని గతంలో కూడా విదేశీ గడ్డపై చాలాసార్లు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి భారతదేశంలో ఎవరికి రక్షణ లేదని హిందూ దేవిదేవతలు హింసావాదులని అందుకే వారి చేతుల్లో మారణాయుధాలైన శంఖు, చక్రం, గదా, త్రిషూలం లాంటి ఆయుధాలు ఉంటాయని నరేంద్ర మోడీ భారత్ మాతాకీ జై అంటాడాని అసలు భరతమాత అంటే ఎవరు భారతమాత ఉందా అని ప్రశ్నించిన రాజకీయ అజ్ఞాని రాహుల్ అని అన్నారు.భారతమాత అంటే ఎవరని నూట నలభై కోట్ల ప్రజానీకాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ సోనియా గాంధీని కూడా అవమానించినట్టేనని ఆయన అన్నారు. మన  విధానంపై దేశ చరిత్ర పై ఎలాంటి అవగాహన లేదని, ప్రపంచానికే మోదీ పెద్దన్న అని అమెరికా అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని అన్నారు.ప్రపంచ వేదికపై చాలా దేశాల అధ్యక్షులు నరేంద్ర మోడీకి పాదాభివందనం చేసిన విషయం రాహుల్ గుర్తు తెచ్చుకోవాలని అన్నారు.భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని దీనికోసం అందరం ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. బిజెపి నాయకులు కట్ట మహేష్, పల్లె మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.